సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- May 14, 2026
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. యూఏఈలోని ఫుజైరా ఓడరేవుకు సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా హైజాక్ చేశారు. ఈ నౌకను ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించడంతో హర్మూజ్ జలసంధి ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సముద్రంలో మునిగిన భారత నౌక ‘హాజీ అలీ’
మరోవైపు ఒమన్ తీరంలో భారతీయ జెండాతో ప్రయాణిస్తున్న ‘హాజీ అలీ’ అనే సరుకు రవాణా నౌక డ్రోన్ దాడికి గురై సముద్రంలో మునిగిపోయింది. గుజరాత్‌కు చెందిన ఈ నౌక సోమాలియా నుండి షార్జాకు పశువులను తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. నౌకలో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీర రక్షక దళం సురక్షితంగా కాపాడింది. వాణిజ్య నౌకలపై జరుగుతున్న ఈ దాడులను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది.
చైనా సూపర్ ట్యాంకర్ పై పొంచి ఉన్న ముప్పు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్న తరుణంలో, హర్మూజ్ జలసంధిలో చైనాకు చెందిన ‘యువాన్ హువా హు’ అనే ముడి చమురు ట్యాంకర్‌పై కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత రెండు నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న ఈ నౌక తాజాగా జలసంధిని దాటింది. ఇరాన్ నౌకలపై అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తాజా వార్తలు
- పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- తైవాన్ జోలికొస్తే యుద్ధమే.. ట్రంప్‌కు జిన్‌పింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
- సీఎం విజయ్ మరో బిగ్ డెసిషన్..
- సముద్రంలో భారత నౌక జలసమాధి.. హైజాకర్ల చేతిలో మరో షిప్!
- ఇంధన పొదుపు, విదేశీ మారకద్రవ్యం ఆదాకు ప్రజలు సహకరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- BRICS దేశాల విదేశాంగ మంత్రులతో భారత్ చర్చలు
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..వారానికి ఒక రోజు ‘నో వెహికిల్ డే’!
- ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!









