‘హ్యాపీ జర్నీ’ టీమ్‌ పై నటి సునయన ఆవేదన

- May 15, 2026 , by Maagulf
‘హ్యాపీ జర్నీ’ టీమ్‌ పై నటి సునయన ఆవేదన

టాలీవుడ్ నటి సునయన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ జర్నీ’. బుధవారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే, పోస్టర్‌లో ఇతర నటీమణుల ఫోటోలు ఉన్నప్పటికీ, తన ఫోటో లేకపోవడంపై సునయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

షూటింగ్‌లో షాపింగ్‌కు వెళ్తే పోస్టర్ నుంచి తీసేస్తారా?
ఈ విషయం పై ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన సునయన.. చిత్ర యూనిట్‌ను సూటిగా ప్రశ్నించారు. “ఇది నిజంగా నాకు షాకింగ్‌గా అనిపిస్తోంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు గ్యాప్ దొరికితే షాపింగ్‌కు వెళ్లడం సహజం. కేవలం అంత మాత్రానికే పోస్టర్‌లో నా ఫోటో లేకుండా చేస్తారా?” అని ఆమె నిలదీశారు.

ఇంట్లో వాళ్లు అడుగుతుంటే బాధగా ఉంది..                                                                           “పోస్టర్లు, టీజర్లు అనేవి ఏ నటికైనా చాలా ముఖ్యం. పోస్టర్‌లో నువ్వు లేవేంటి అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటే చాలా బాధగా అనిపించింది. నేను సాధారణంగా ఇలాంటి విషయాలు అడిగే వ్యక్తిని కాదు, కానీ ఇది నాకు అన్యాయం అనిపించి మాట్లాడుతున్నాను” అని సునయన ఎమోషనల్ అయ్యారు.ఈ ప్రయాణం తనకు ఎంతో నేర్పించిందని పేర్కొన్న సునయన, దర్శకుడు అభిరామ్ నాయుడు దీని పై ఏమంటారో చూడాలని ట్యాగ్ చేశారు. దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com