ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- May 15, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- నెదర్లాండ్స్ చేరుకున్న ప్రధాని మోదీ–భారత్-ఈయూ వాణిజ్య బంధాలకు కొత్త ఊపు
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రతో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
- ప్రమాదకర డ్రైవింగ్‌కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్‌బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ









