న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- May 15, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశమై దేశ, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగ అభివృద్ధి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై పరస్పర చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశాలు మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, పలు ప్రాధాన్య అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







