ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- May 15, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







