ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!

- May 16, 2026 , by Maagulf
ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
మస్కట్: అమ్మాన్‌లో జరిగిన తాజా విడత చర్చలు విజయవంతంగా ముగియడాన్ని ఒమన్ సుల్తానేట్ స్వాగతించింది. ఈ చర్చల ఫలితంగా, యెమెన్ సంక్షోభంతో సంబంధం ఉన్న 1,600 మందికి పైగా ఖైదీలు మరియు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయడానికి సంబంధిత పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
డిసెంబర్ 2025లో ఒమన్ సుల్తానేట్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల సందర్భంగా కుదిరిన అవగాహనల ఆధారంగా ఈ ఒప్పందం రూపొందినట్టు పేర్కొంది. యెమెన్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో చేపట్టిన మానవతా ప్రయత్నాలలో ఇది నిరంతర పురోగతిని ప్రతిబింబిస్తుందపి తెలిపింంది. ఈ మానవతా ఒప్పందం అమలును సులభతరం చేయడంలో మరియు మద్దతు ఇవ్వడంలో జోర్డాన్, ఐక్యరాజ్యసమితి మరియు అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ చేసిన కృషిపై సుల్తానేట్ ప్రశంసలు కురిపించింది.  
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com