'హనుమాన్' తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్
- May 17, 2026
తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ, కె. నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'హనుమాన్' తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్
సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ సమయంలో తన అద్బుతమైన వరల్డ్ బిల్డింగ్, గొప్ప కథనం, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు 3D ఫార్మాట్లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించగా, సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర అద్భుతమైన విజువల్స్‌తో ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. గౌర హరి, అనుదీప్ దేవ్ అందించిన సంగీతం సినిమాకి ఎమోషన ని తీసుకొచ్చి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.
ఇప్పటికే కోట్లాది మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ‘హనుమాన్’ ఇప్పుడు అప్‌గ్రేడ్ చేసిన 3D విజువల్స్‌తో మరింత అద్భుతమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మరోసారి ప్రపంచవ్యాప్తంగా అలరించడానికి హనుమాన్ సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు







