ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..

- May 17, 2026 , by Maagulf
ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పౌర పురస్కారం..

స్వీడన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక అరుదైన, అత్యున్నత గౌరవం దక్కింది. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా స్వీడన్ ప్రభుత్వం మోదీని తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. 'రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్' (Royal Order of the Polar Star, Commander Grand Cross) పేరుతో పిలిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డును మోదీకి ప్రదానం చేశారు. ప్రపంచ వేదికపై భారతదేశ ఖ్యాతిని మరింత శిఖరాలకు చేర్చిన మోదీకి దక్కిన ఈ పురస్కారం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో గర్విస్తున్నారు.

విదేశీ గడ్డ పై మన ప్రధానికి ఇంతటి గొప్ప గౌరవం దక్కడం ద్వైపాక్షిక స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. వివిధ రంగాల్లో భారత్ ఆకట్టుకునేలా ఎదుగుతున్న తీరును స్వీడన్ నాయకత్వం ప్రత్యేకంగా కొనియాడింది. మోదీ అద్భుత నాయకత్వంలో భారత్ సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ స్వీడన్ ప్రభుత్వం ఈ అత్యుత్తమ పురస్కారాన్ని అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com