తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- May 17, 2026
హైదరాబాద్: తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు వేడిగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఎండల తీవ్రతతో జనం విలవిలలాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు భారత వాతావరణ శాఖ మరో షాక్ ఇచ్చింది.
తెలంగాణకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 20 వరకు తెలంగాణలో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41-44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా, వేడి సంబంధిత అనారోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించారు.
ఆరెంజ్ అలర్ట్ అంటే ప్రజలకు ముఖ్యంగా శిశువులు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థం.
ఈ సుదీర్ఘ పొడి వాతావరణంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా, వేడి సంబంధిత అనారోగ్యాల తీవ్రమైన ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (DPH) జాగ్రత్తలు చెప్పింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళల్లో బయట తిరగడాన్ని పరిమితం చేసుకోవాలంది. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలంది. నీరు, ఓఆర్ఎస్, లేదా సాంప్రదాయ ద్రవాలను ఉపయోగించి శరీరంలో తగినంత నీటిని నిలుపుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







