‘బ్లాక్ మెయిల్’ చేస్తానంటున్న వరుణ్ సందేశ్..
- May 17, 2026
వరుణ్ సందేశ్ రీ ఎంట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించాడు. వరుణ్ సందేశ్ హీరోగా హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాణంలో శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకత్వంలో బ్లాక్ మెయిల్ అనే కొత్త సినిమాని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
ఈ సినిమాలో జెమిని సురేష్, పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్.. పలువురు కీలకపాత్రలు పోషించనున్నారు. ఓపెనింగ్ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట క్లాప్ కొట్టగా నిర్మాత భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా జెమిని సురేష్ గారి తల్లి ఎం వెంకట సుబ్బలక్ష్మి మొదటి షాట్ దర్శకత్వం వహించారు.
సినిమా లాంచ్ అనంతరం వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నాకు డైరెక్టర్ చాలా కాలంగా తెలుసు. ఈ కథ చెప్పినప్పుడు మంచి కంటెంట్ తో సినిమా వస్తుంది అని అర్థం అయింది అని అన్నారు. డైరెక్టర్ శ్రీనివాస్ గుండ్రెడ్డి మాట్లాడుతూ.. మంచి ప్రాజెక్ట్ ను నమ్మి నా చేతిలో పెట్టిన నిర్మాతలకు కృతజ్ఞతలు. త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.
నటుడు జెమిని సురేష్ మాట్లాడుతూ.. బ్లాక్ మెయిల్ సినిమాలో వరుణ్ సందేశ్ గారితో కలిసి నటించబోతున్నాను. నేను హీరోగా తొలి చిత్రం దర్శకత్వం చేసిన శ్రీనివాస్ ఈ సినిమాలో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండబోతుంది అని అన్నారు. నిర్మాత అవినాష్ మాట్లాడుతూ.. నేను ఈ సినిమా రంగంలోకి రావడానికి ముఖ్య కారణం 200 కుటుంబాలకు పని కలిగించవచ్చు అని. నా సినిమాకు వచ్చే లాభాలలో 10% మా సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ కి ఇస్తాను అని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







