యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- May 18, 2026
యూఏఈలోని ఏకైక అణువిద్యుత్ కేంద్రం ‘బారాక్’ లక్ష్యంగా జరిగిన డ్రోన్ దాడిపై భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఈ దాడి జరగడం ప్రమాదకరమైన పరిణామమని అభివర్ణిస్తూ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. యుఎఇలోని అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని చేసిన ఇటువంటి చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని, ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తాయని భారత్ పేర్కొంది. సంబంధిత పక్షాలన్నీ సంయమనం పాటించాలని, తక్షణమే దౌత్యం, చర్చల మార్గానికి తిరిగి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. కాగా, గల్ఫ్ దేశంలోని ఏకైక అణు విద్యుత్ కేంద్రమైన బారాక్ సమీపంలో ఒక జనరేటర్‌పై డ్రోన్ దాడి జరగడంతో ఆ ప్రాంగణ పరిసరాల్లో మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడికి ఇప్పటివరకు ఎవరు బాధ్యత వహించలేదని, డ్రోన్ దాడి ఎక్కడి నుండి జరిగిందనే మూలాన్ని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







