దుబాయ్‌లో 13 కమ్యూనిటీ క్లబ్‌లను ప్రారంభించిన AES
- May 19, 2026
దుబాయ్: ఆయేషా షేక్ స్థాపించిన AES ఎడ్యూ మార్కెటింగ్ ఈవెంట్స్ నెట్‌వర్క్ FZE ఆధ్వర్యంలో “బిల్డింగ్ విత్ ది కమ్యూనిటీ” అనే థీమ్‌తో AES అంబాసిడర్స్ పిన్నింగ్ సెరిమనీ 2026 మరియు 13 AES కమ్యూనిటీ క్లబ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమం మే 17, 2026న దుబాయ్‌లోని ఫిర్కీ రెస్టారెంట్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 39 మంది AES అంబాసిడర్లను అధికారికంగా నియమించారు. వ్యాపారం, మహిళా సాధికారత, విద్య, సమానత్వం, సంస్కృతి, కమ్యూనిటీ సేవ, ఆరోగ్యం, ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణ, యువ నాయకత్వం, పేరెంటింగ్, సృజనాత్మకత, పఠనం వంటి రంగాల్లో కమ్యూనిటీ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ క్లబ్‌లు పనిచేయనున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ మాజీ రాయబారి, యూఏఈ జాతీయ పతాక రూపకర్త హిజ్ ఎక్సలెన్సీ అబ్దుల్లా అల్ మైనాహ్ హాజరయ్యారు. కేవలం 19 ఏళ్ల వయసులో యూఏఈ జాతీయ జెండాను రూపకల్పన చేసిన ఆయన సమక్షం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రారంభించిన క్లబ్‌లలో AES బిజినెస్ క్లబ్, విమెన్ ఎంపవర్‌మెంట్ క్లబ్, ఎడ్యుకేషన్ క్లబ్, ఇన్‌క్లూసివ్ క్లబ్, ఫెస్టివల్ & కల్చర్ క్లబ్, కమ్యూనిటీ కేర్ క్లబ్, హెల్త్ క్లబ్, ఫిట్‌నెస్ క్లబ్, ఎన్విరాన్‌మెంట్ & సస్టైనబిలిటీ క్లబ్, యూత్ & స్టూడెంట్ లీడర్‌షిప్ క్లబ్, పేరెంటింగ్ & ఫ్యామిలీ క్లబ్, ఆర్ట్స్, క్రియేటివిటీ & టాలెంట్ క్లబ్ మరియు రీడింగ్ క్లబ్ ఉన్నాయి.
AES అంబాసిడర్లుగా నియమితులైన వారిలో పీయూష్ బియాని, రాబియా తారిక్, అనీసా మొహమ్మద్, వందనా జోస్, ప్రియా భేడి, కవిత శ్రీరామ్, లవీనా చౌహాన్, ఉర్వశి పమ్నాని, ప్రతిమ వర్మ, నీనా రైనా, నిషా టాండన్, వరుణ్ రైనా, అనౌష్కా టాండన్, సరికా నేహల్ పారిఖ్, ఫుర్కాన్ మొహమ్మద్ అఖ్తర్, ధమోదరన్ రామమూర్తి, సయ్యద్ షాకిర్ రసూల్ షరీఫ్, షాహిన్ షేక్, డాక్టర్ ఈవా ప్రధాన్, డాక్టర్ సమన్ ఉరూజ్ జీషాన్, హృత్విక హేమంత్, కోచ్ హోయామ్ జహెల్రసూల్ మొహమ్మద్, కోచ్ మొహమ్మద్ హస్నైన్ షేక్, అనూషా సీరం, నేహా మెహతా, వక్వాసుద్దీన్ విక్కీ, లుబ్నా నిషాత్, డాక్టర్ పాయల్ శెవానీ, ఏంజెలినా మరియం అజయ్ వైద్యన్, ఆయాన్ అహ్మద్, ప్రణతి మజుందర్, డాక్టర్ దీపా ఖేమాని, అమినా నుబ్లా నిజార్, మనసి అభిజిత్ దేవధర్, పెనాజ్ బార్డోలివాలా, ధరా షా, సూబికా ఫవాద్, వందనా జోస్ మరియు సంసిత ప్రదీప్ ఉన్నారు.
ఈ కార్యక్రమానికి Maa Gulf, ది లెమన్ స్టూడియో బై రమేష్, మక్సూద్ అహ్మద్, ధారవ్య ఫోటోగ్రఫీ, బ్లాక్ ట్యులిప్ ఫ్లవర్స్, నక్శ్ బై రాబీ, బియాని జువెల్స్, సూబికా ఫవాద్ ఆర్ట్ అండ్ డిజైన్, హై ఛాయిస్ అడ్వర్టైజింగ్, మ్యూనిక్ గ్రోసరీ మరియు ఫిర్కీ రెస్టారెంట్ సంస్థలు భాగస్వాములుగా సహకరించాయి.
ఈ సందర్భంగా AES వ్యవస్థాపకురాలు ఆయేషా షేక్ మాట్లాడుతూ, సమాజ సేవ పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, అర్థవంతమైన కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్మించడమే AES అంబాసిడర్ ప్రోగ్రామ్ లక్ష్యమని తెలిపారు. ప్రతి క్లబ్ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.




తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







