రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- September 29, 2026
రాస్ అల్ ఖైమా: ఎన్నో ఏళ్లుగా రాస్ అల్ ఖైమాలోని ఓ కొండపై ప్రత్యేకమైన నిర్మాణ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అల్ ఖైమి ప్యాలెస్ మరోసారి అమ్మకానికి వచ్చింది. స్థానికంగా దీనిని ‘హాంటెడ్ ప్యాలెస్’ అని పిలుస్తారు. ఈ 35 బెడ్‌రూమ్‌ల భారీ భవనాన్ని ఫర్నిచర్ లేకుండా Dh22.5 మిలియన్లకు, అసలు కళాఖండాలు, పురాతన వస్తువులు, కలెక్షన్లతో కలిపి Dh23.5 మిలియన్లకు అమ్మకానికి పెట్టారు.
భయపెట్టే భవనం కాదు.. అద్భుతమైన నిర్మాణం
కొండపై ఉన్న ఈ ప్యాలెస్ ప్రధాన లాబీకి చేరుకోవడానికి సుమారు రెండు నిమిషాలు నడవాల్సి ఉంటుంది. దగ్గరకు వెళ్లేకొద్దీ భవనం భారీ పరిమాణం స్పష్టంగా కనిపిస్తుంది. ప్యాలెస్‌లో అడుగుపెట్టగానే ముందుగా కనిపించేది అరుదైన గ్రీస్‌కు చెందిన థాసోస్ వైట్ మార్బుల్. ఈ తెల్లని పాలరాయి భవనం వెలుపల మాత్రమే కాకుండా లోపలి భాగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగించారు. లోపలికి వెళ్లిన తర్వాత భారీ హాళ్లు, చెక్కతో చేసిన కళాత్మక ఫర్నిచర్, డిజైన్ గల గోడలు, పెయింటింగ్స్, భారీ షాండిలియర్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి.
1985లో నిర్మాణం
ఈ ప్యాలెస్‌ను 1985లో రాస్ అల్ ఖైమా పాలక కుటుంబానికి చెందిన దివంగత షేక్ అబ్దులజీజ్ బిన్ హుమైద్ అల్ ఖైమి నిర్మించారు. ప్యాలెస్ ఇంటీరియర్ డిజైన్‌లో ఇరాన్, మొరాకో, భారత్, చైనా దేశాలకు చెందిన కళాకారులు, నిపుణులు పనిచేశారు.
ప్యాలెస్ మధ్యలో భారీ పిరమిడ్
రెండో అంతస్తులోని నిర్మాణం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అక్కడ మధ్యలో తెల్లటి భారీ పిరమిడ్ ఆకారపు నిర్మాణం ఉంది. దాని చుట్టూ ఎనిమిది బెడ్‌రూమ్‌లు ఏర్పాటు చేశారు. సాధారణంగా బెడ్‌రూమ్‌లకు వెళ్లే కారిడార్‌లకు బదులుగా పిరమిడ్ చుట్టూ తిరుగుతూ గదులకు చేరుకునేలా ఈ అంతస్తును రూపొందించారు.
ప్యాలెస్ నుంచి మ్యూజియంగా..
2019లో ఈ భవనానికి కొత్త రూపం వచ్చింది. తారిఖ్ అహ్మద్ అల్ షర్హాన్ దీనిని ‘అల్ ఖస్ర్ అల్ ఘామెద్’ (Palace of Ambiguity) పేరుతో మ్యూజియంగా మార్చారు. మ్యూజియాన్ని సందర్శించేందుకు ఒక్కొక్కరికి Dh75 టికెట్ ఉండేది.
ఈ ప్యాలెస్ ఉన్న మొత్తం స్థలం 191,742 చదరపు అడుగులు కాగా, భవనం నిర్మిత విస్తీర్ణం 33,827 చదరపు అడుగులుగా ఉంటుంది. కాగా, బ్రిటన్, భారత్, గల్ఫ్ ప్రాంతాల నుంచి కొనుగోలుదారుల ఆసక్తి చూపుతున్నారని ఏజెంట్లు తెలిపారు. కొందరు దీన్ని ప్రైవేట్ కుటుంబ నివాసంగా, మరికొందరు హాస్పిటాలిటీ లేదా ఈవెంట్ వేదికగా మార్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
కూల్చివేసినా.. మార్చినా ఆంక్షలు లేవు
ఈ ప్యాలెస్‌కు ప్రస్తుతం ప్రత్యేకమైన హెరిటేజ్ పరిరక్షణ పరిమితులు లేవు. దీంతో కొత్త యజమాని అవసరాన్ని బట్టి భవనాన్ని కూల్చడం, తిరిగి నిర్మించడం, పునరుద్ధరించడం లేదా పూర్తిగా మార్పులు చేయడం వంటి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..
- సౌదీ అరేబియాలోని జాజాన్‌లో యెమెన్ వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో ప్రైవేట్ రంగ ఉద్యోగుల జీతాలకు కొత్త వ్యవస్థ..!!







