అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ

- September 30, 2026 , by Maagulf
అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ

బాలల చేతుల్లోనే తెలుగు భాష భవిష్యత్తు–డా.గజల్ శ్రీనివాస్

30కి పైగా దేశాల నుంచి ప్రవాస బాలబాలికల సాంస్కృతిక ప్రదర్శనలు

ఒంగోలు: ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబర్ 5, 6 తేదీలలో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్న “నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు 2026” సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన “ప్రవాస బాలల సాంస్కృతిక సంబరాలు” విశేషంగా ఆకట్టుకున్నాయి.
సెప్టెంబర్ 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాగిన ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో 30కి పైగా దేశాలకు చెందిన ప్రవాస తెలుగు బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఆయా దేశాల కాలమానానికి అనుగుణంగా పిల్లలు వివిధ సమయాల్లో అంతర్జాలం ద్వారా అనుసంధానమై తెలుగు భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం, నాటకం తదితర కళారూపాలను ప్రదర్శించారు.

కార్యక్రమాన్ని డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రారంభించారు.రాధికా మంగిపూడి జ్యోతి ప్రజ్వలన చేశారు.విక్రమ్,రాధికా మంగిపూడి,కస్తూరి ఫణిమాధవ్ కార్యక్రమ సమన్వయకర్తలుగా వ్యవహరించారు.ఈ సందర్భంగా ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ,“తెలుగు భాష బాలబాలికల హృదయాలకు చేరినప్పుడే, వారు ఆ భాషా కాగడాను మరో తరానికి అందించగలుగుతారు. తెలుగు భాష భవిష్యత్తు బాలల చేతుల్లోనే ఉంది. అందుకే బాలల కోసం ప్రత్యేకంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నాం” అని అన్నారు.
ప్రపంచ స్థాయిలో బాలలను కేంద్రబిందువుగా చేసుకొని తెలుగు భాష, సంస్కృతి, కళలకు అంకితమైన మహాసభలను నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. విదేశాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి బాలబాలికలు, తల్లిదండ్రులు, తెలుగు భాషాభిమానులు ఈ మహాసభల్లో పాల్గొనడానికి చూపుతున్న ఉత్సాహం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా నుంచి ప్రారంభమైన బాలల సాంస్కృతిక ప్రదర్శనలు అనంతరం యూరప్, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, జపాన్, చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు విస్తరించాయి. వివిధ దేశాల్లో నివసిస్తున్న తెలుగు చిన్నారులు తమ మాతృభాషపై ఉన్న ప్రేమను, తెలుగు కళలపై ఉన్న మమకారాన్ని తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు.
కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ అధ్యక్షులు శ్రీ గొమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ, బాల్యం నుంచే పిల్లలకు నాటకం, సంగీతం, సాహిత్యం వంటి కళారూపాలను పరిచయం చేయడం అత్యంత అవసరమన్నారు. ప్రవాస ప్రాంతాల్లో తెలుగు పిల్లలకు నాటకరంగంపై శిక్షణనిచ్చిన సందర్భాలను గుర్తుచేసుకుంటూ, బాలల కోసం ఇలాంటి అంతర్జాతీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వాహకులను అభినందించారు.

విదేశాల్లో నివసిస్తున్న తెలుగు బాలబాలికలు తమ మాతృభాష, సంస్కృతి పట్ల చూపుతున్న ఆసక్తి భారతదేశంలోని తెలుగు పిల్లలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలవాలని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు ఆకాంక్షించారు.రెడ్‌క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు పి. రామచంద్రరాజు మాట్లాడుతూ, ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో తాను సమన్వయకర్తగా పనిచేయడం గర్వకారణమన్నారు. ఆ మహాసభల్లో బాలబాలికలు తెలుగు భాష పట్ల చూపిన ఉత్సాహం తనకు ఇప్పటికీ గుర్తుందని, ఇప్పుడు ప్రత్యేకంగా బాలల ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం మరింత ఆనందదాయకమని తెలిపారు. అంతర్జాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస బాలబాలికలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు పొడపాటి తేజస్విని మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతి పట్ల చైతన్యం తీసుకురావడం గొప్ప ప్రయత్నమన్నారు. బాలబాలికల కోసం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఒక చారిత్రాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు. డా.గజల్ శ్రీనివాస్ ఎంతో ఉత్సాహంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, బాలల తెలుగు మహాసభలకు శుభాకాంక్షలు తెలిపారు.

సమాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా.మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, బాలబాలికల కోసం ప్రత్యేకంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం, అందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగు చిన్నారులను భాగస్వాములను చేయడం ఎంతో సంతోషకరమన్నారు. తాను వివిధ దేశాలు, రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు ప్రవాస తెలుగు పిల్లలు మాతృభాషా సంస్కృతులను ఎంతో ప్రేమతో ప్రదర్శించడం చూసి ఆనందించానని గుర్తుచేశారు.

“ప్రవాస బాలబాలికలు ఇంతటి ఉత్సాహంతో పాల్గొనడం అత్యంత ఉత్తేజకరం. డిసెంబర్ 5, 6 తేదీలలో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభలకు ఈ అంతర్జాల సాంస్కృతిక సంబరాలు ఒక గొప్ప ముందడుగుగా నిలుస్తాయి” అని ఆయన పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస బాలబాలికలందరికీ డా.గజల్ శ్రీనివాస్ ఆన్‌లైన్ ద్వారా ప్రశంసాపత్రాలను అందజేశారు.అనంతరం శ్రీమతి రాధికా మంగిపూడి కార్యక్రమ విశేషాలను సమీక్షించగా, విక్రమ్ సుఖవాసి,కస్తూరి ఫణిమాధవ్ వందన సమర్పణ చేశారు.
ప్రపంచం నలుమూలల నుంచి చిన్నారులను ఒకే అంతర్జాల వేదికపైకి తీసుకువచ్చి, “తెలుగు భాష – తెలుగు సంస్కృతి – తెలుగు కళలు” అనే భావనతో సాగిన ఈ ప్రవాస బాలల సాంస్కృతిక సంబరాలు, డిసెంబర్ 5, 6 తేదీలలో ఒంగోలులో జరగనున్న నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు – బాలలు 2026కు ప్రత్యేక ఆకర్షణగా, స్ఫూర్తిదాయకమైన సన్నాహక కార్యక్రమంగా నిలిచాయి.

అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఈశ్వర్ లిఖిత్ గాదె, పృథ్వి గాదె, అన్ష్ పులి, లితాన్షి జుజ్జవరపు, సాత్విక్ సూరంపూడి, అన్విత చెరువు, జయేష్ చావలి
ఆస్ట్రేలియా నుండి కృష్ణ సుహాస్ తటవర్తి,వీర లక్ష్మి శివలెంక,  కార్తికేయ ఇసకపల్లి 
న్యూజిలాండ్ నుండి సంస్థిత కూనపులి, గానవి శ్రీ ఆమ్గోత్, సుదేన రావూరు
సింగపూర్ నుండి కాండూరి శ్రీ సాన్వి, కాండూరి శ్రీ ధన్వి, ధృతిక రచినేపల్లి, శ్రీ విష్ణు ప్రియ, మేక శ్రీ శరణి, మేక శ్రీ వైష్ణవి, మేక షణ్ముఖ్ స్వరూప్, కొంజేటి వెంకట ఇషాన్ కృష్ణ, శ్రీ వైష్వి గుగ్గిలం, ముప్పూరు తన్వి, అప్పల వెంకట దీక్ష మలేసియా నుండి మనోష్ రావు గంగాధరన్, హితేష్ రావు సుబ్రమణియం, వినిత సాయివిష్ణు వినిత నాగరాజ్, జయశ్రీ సుబ్రమణియం, తరుణ్ ప్రభ లచమన, నిరంజన్న గుణశేఖరన్, స్వస్తికా నాగరాజు, ప్రితిక శ్రీ ఆరుముగం, భార్గవి రెడ్డి సుదిరెడ్డి, ఆద్య కనుమూరి, దేవిశ్రీ దూలం, ధన్య కనుమూరి, వారిష్ నాయుడు హరిహరన్
సౌదీ అరేబియా నుండి శ్రీ ఆరుషి యలమంచి, గుబ్బల లక్ష్మి చైతన్య
యూఏఈ నుండి నంబూరి విద్య తన్విక, శ్రీధిక పినిశెట్టి, శ్రీకీర్తి అమరవాది, రుషిక శ్రీ పెద్దాడ, రఘుచరణ్ నండూరి కువైట్ నుండి జి.వి.ఎస్.బి. అజితేష్, ఒమాన్ నుండి పుష్యమి పవన్
ఖతార్ నుండి యువన మండదపు, కొడవటి నాగసాయి సాత్విక్, లిషిత రెడ్డి పంజుగుల్ల, జాన్వి లక్ష్మిక కొమ్మిశెట్టి, శ్రోత్రేయ కొలిపాక, శాండిల్య కొలిపాక, ధనుశ్రీ సాయి వైష్ణవి సమ్మెట, సుకృత్ కృష్ణ సాయి సాధు, పార్వణి లక్ష్మి సాయి సాధు, వేదాంత్ రామ్ శ్రీధర, శర్వ శ్రేయాన్షిక చట్టా, వేదాన్ష్ చేరుపల్లి యూకె నుండి వరుణ్య కడవేర్గు, సాయి శ్రీరామ్ గంగూరి, దక్షిణాఫ్రికా నుండి వేదాంత్ రాప్రోలు, వంశిక వీరబోయిన, కార్తీక చందన కాలిపిండి, హేమిష్ మతిరెడ్డి
జర్మనీ నుండి అద్వైత్ గోపిశెట్టి, అద్విక్ గోపిశెట్టి, పోలెండ్ నుండి రమ చింతా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com