ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- September 29, 2026
న్యూ ఢిల్లీ: భారత్-అమెరికా సంబంధాలపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదం పై భారత్ ఆందోళనలను భాగస్వామ్య దేశాలు గుర్తించకపోతే, అది ద్వైపాక్షిక సంబంధాల పై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఒక ‘రెడ్ లైన్ గీసుకుందని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని వ్యాఖ్యానించారు.భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్ పట్ల అమెరికా సానూకూల ధోరణి కనబరుస్తున్న నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఉన్నతస్థాయి సమావేశాల అనంతరం న్యూయార్క్‌లో ‘ఏషియా సొసైటీ’ నిర్వహించిన కార్యక్రమంలో జైశంకర్ ప్రసంగించారు. దశాబ్దాలుగా పొరుగు దేశం ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుని భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటోందంటూ పాకిస్థాన్ పేరును ప్రస్తావించకుండానే జైశంకర్ దుయ్యబట్టారు. అత్యంత కీలకమైన ఉగ్రవాద సమస్యపై మా భాగస్వామ్య దేశాల నుంచి సరైన అవగాహన, సానుభూతి లభించకపోతే అది కచ్చితంగా ఇబ్బందులకు దారితీస్తుందని అన్నారు. మా ప్రాథమిక ఆందోళనలను విస్మరిస్తే సంబంధాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు.
భారత్-అమెరికా సంబంధాల పై ఆ ప్రభావం
భారత్-అమెరికా సంబంధాలను ప్రభావితం చేసే అంశాల్లో వాణిజ్య, టారిఫ్ వివాదాలతోపాటు ఉగ్రవాదం కూడా ప్రధానమైనదని జైశంకర్ చెప్పారు. భారత్-అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తున్నప్పటికీ, పరిష్కరించాల్సిన సమస్యల విషయంలో వాస్తవిక దృక్పథంతో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పొరుగు దేశం నుంచే మద్దతు అందుతోందని నిరూపించేందుకు భారత్ పదేపదే తగిన ఆధారాలను సమర్పించిందని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీస్ లగ్జరీ పెట్రోలింగ్ ఫ్లీట్లోకి ల్యాండ్ రోవర్ డిఫెండర్
- తాయిఫ్ గవర్నర్‌తో భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి భేటీ
- చార్మినార్ పరిసరాల్లో నకిలీ వెండి వర్క్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
- యూఏఈ నేషనల్ డేకి షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- తెలంగాణలో SIR గడువు మళ్లీ పొడిగించిన ఎన్నికల సంఘం
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!







