'డోంట్ స్లీప్' నుంచి టాంజిన్ గా సునీల్ థాపా ఫస్ట్ లుక్ రిలీజ్
- May 19, 2026
ఇంద్ర రామ్, షామ్‌దత్, వి చూడామణి, వి డ్రీమ్ ఫిల్మ్స్ సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' నుంచి టాంజిన్ గా సునీల్ థాపా ఫస్ట్ లుక్ రిలీజ్
'చౌర్య పాఠం'లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా, మమ్ముట్టి నటించిన 'స్ట్రీట్ లైట్స్'కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' రూపొందుతోంది. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు.
ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ థాపా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన జన్మదిన సందర్భంగా ప్రేమతో స్మరించుకుంటూ ఈ చిత్రంలో ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆయన పోషించిన “టాంజిన్” పాత్ర పవర్‌ఫుల్‌గా, ప్రభావవంతంగా ఉండబోతోంది.
తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో సునీల్ థాపా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయనున్నారు.
ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం పని చేస్తోంది. 'పుష్ప: ది రైజ్' చిత్రానికి పనిచేసిన మోనికా-రామకృష్ణ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. సంగీతాన్ని గోకుల్ హర్షన్ అందించారు. స్టేట్ అవార్డు గ్రహీత అయిన మనోజ్ ఎడిటింగ్ చేశారు. గతంలో RDX , దుల్కర్ సల్మాన్ నటించిన ఐయామ్ గేమ్ చిత్రాలకు పనిచేసిన సజీర్, లూనా కథను అందించారు.
ఎమోషనల్, టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్ప సైకాలజికల్ థ్రిల్లర్ అనుభూతిని ప్రేక్షకులకు అందించబోతుంది.
తారాగణం: ఇంద్ర రామ్, రవీంద్ర విజయ్, తబా రీమా, జ్యోతి బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్, కల్ప లత, అనీష్ కురువిల్లా, వెన్నెల కిషోర్, నాగి జబర్దస్త్, డాక్టర్ భద్రమ్, రఘుబాబు, తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
డైరెక్టర్, DOP: షామ్‌దత్ ISC
కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: సజీర్ బాబా & లూనా జబిన్
నిర్మాత: వి చూడామణి
బ్యానర్: వి డ్రీమ్ ఫిల్మ్స్
సంగీతం: గోకుల్ హర్షన్
ప్రొడక్షన్ డిజైన్: మోనికా రామకృష్ణ
PRO: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









