ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- May 19, 2026
మనామా: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బహ్రెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ సూడాన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బహ్రెయిన్ సివిల్ ఏవియేషన్ వ్యవహారాల విభాగం (CAA) ప్రకటించింది.
ఈ నిర్ణయం మే 19 నుంచి అమల్లోకి రానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) విడుదల చేసిన తాజా హెచ్చరికలు, ఆయా దేశాల్లో ఎబోలా పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) వెల్లడించింది.
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవేశ నిబంధనలను సవరించినట్లు అధికారులు తెలిపారు. ఆయా మూడు దేశాల నుంచి నేరుగా వచ్చే ప్రయాణికులతో పాటు, గత 30 రోజులలో ఆ దేశాలను సందర్శించిన విదేశీయులకూ బహ్రెయిన్‌లో ప్రవేశం నిరాకరించనున్నారు.
అయితే ఆ దేశాల నుంచి తిరిగి వచ్చే బహ్రెయిన్ పౌరులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య భద్రతా నిబంధనలు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చే ప్రయాణికులంతా సంబంధిత అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సివిల్ ఏవియేషన్ విభాగం సూచించింది. ఈ ఆంక్షలు ప్రస్తుతానికి 30 రోజుల పాటు అమల్లో ఉంటాయని, పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైతే ప్రభావిత దేశాల జాబితాలో మార్పులు చేసే అవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







