#చిరు158 చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాశ్ కొల్లా
- May 19, 2026
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ #చిరుబాబీ2 / #చిరు158 చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాశ్ కొల్లా
మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో టాప్ టాలెంట్‌ను టీమ్‌లోకి ఆహ్వానించారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా టీంలో చేరారు.
మెగాస్టార్ చిరంజీవిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అత్యంత ఫెరోషియస్ అవతార్‌లో ప్రజెంట్ చేయడానికి, భారీ స్థాయి సినిమాటిక్ వరల్డ్‌ను తన విజన్, ఎక్స్‌పర్టైజ్‌తో అవినాష్ కొల్లా అద్భుతంగా ఆవిష్కరించనున్నారు.
ఇప్పటికే విడుదలైన లుక్ టెస్ట్ ఇమేజెస్, అనౌన్స్‌మెంట్ పోస్టర్, అలాగే చిరంజీవి జిమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వీడియో ఆయన కొత్త స్టైలిష్ అవతార్‌పై భారీ ఆసక్తిని పెంచాయి.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌ను గ్రాండ్‌గా తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న బాబీ కొల్లి, ఈసారి చిరంజీవిని ఇప్పటివరకు చూడని అత్యంత పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా రూపొందుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, హై వోల్టేజ్ ఎలివేషన్స్, థియేటర్లను షేక్ చేసే మాస్ మూమెంట్స్‌తో ఉండబోతోంది.
ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
ప్రొడక్షన్ బ్యానర్: KVN ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కె నారాయణ
డీవోపీ: విజయ్ కార్తీక్ కన్నన్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









