అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- May 19, 2026
ప్రముఖ సినీగీత రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి 71వ జయంతి (20 మే) వేడుకలు...
డాలస్, టెక్సస్: తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - “తానా సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యవంలో రెండు సంవత్సరాల క్రితం సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో, సిరివెన్నెల సమగ్రసాహిత్యం మొత్తాన్ని 6 సంపుటాలలో ముద్రించి ఆవిష్కరించడం జరిగింది.ఎక్కడైతే సిరివెన్నెల తన బాల్యాన్ని గడిపారో, విద్యాబుద్దులు నేర్చుకున్నారో, వివాహం చేసుకున్నారో, అదే గాంధీనగరం వీధిలో, అనకాపల్లి నగరంలో గత జనవరి 25 న సిరివెన్నెల నిలువెత్తు కాంస్యవిగ్రహాన్ని తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యవంలో ఆవిష్కరించడం జరిగింది. భారత రాష్ట్రపతి పురస్కార గ్రహీత, సాయిబాబా మెగా శిల్పశాల అధినేత బుర్రా శివ వరప్రసాద్ అద్బుతంగా రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని ప్రముఖ సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఇది ఒక కవికి ఇచ్చిన ఘన నివాళి. స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ చొరవ, సహకారంతో ఈ చారిత్రాత్మక సంఘటన సాధ్యమైంది”.
ఈ కార్యసాధనలో సహకరించిన కొణతాల రామకృష్ణ కి, సిరివెన్నెల కళాపీఠం వారికి, ఇతర అధికారులకు తానా అధ్యక్షులు నరేన్ కొడాలి, కార్యవర్గసభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇప్పుడు అదే పార్క్ లో విశాఖపట్నం మహానగర కార్పొరేషన్ వారు కేటాయించిన ₹39.70 లక్షల నిధులతో ‘సిరివెన్నెల స్మృతివనం’ కు శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు బుధవారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చెయ్యడం సంతోషం.
సిరివెన్నెల కళాపీఠం, అనకాపల్లి వారి ఆధ్వర్యవంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు సత్యా గ్రాండ్ హాల్ లో జరుగనున్న సిరివెన్నెల జయంతి వేడుకలలో ఎం.వి.ఆర్ నిర్దేశకత్వంలో సిరివెన్నెల సంగీత విభావరి ఒక ప్రత్యేక ఆకర్షణ. సిరివెన్నెల కుటుంబసభ్యులు, సిరివెన్నెల కళాపీఠం సభ్యులు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్, శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు, శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, తానా పూర్వాధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మొదలైనవారు హాజరవుతున్న ఈ వేడుకలలో ప్రముఖ సినీగీత రచయిత భాస్కరభట్ల రవి కుమార్ కు ‘సిరివెన్నెల స్మారక’ పురస్కారం అందజేయనున్నారు. ఈ వేడుకలకు అందరూ ఆహ్వానితులే.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









