కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- May 19, 2026
శ్రీకాకుళం జిల్లాలోని అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్య అయిన ఉద్దానం కిడ్నీ వ్యాధుల నివారణ, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించే అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ (AIIMS) ఢిల్లీ డైరెక్టర్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఎం.శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ అధికారిక సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతుల కల్పనపై కీలక చర్చలు జరిగాయి.
ఉద్దానం కిడ్నీ సమస్యపై విస్తృత చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో దశాబ్దాలుగా పీడిస్తున్న కిడ్నీ వ్యాధుల తీవ్రత, అందుబాటులో ఉన్న వైద్య సాంకేతిక ఆధారాలు, నూతన పరిష్కార మార్గాలపై ఇద్దరి మధ్య విస్తృతమైన చర్చ నడిచింది. ఉద్దానం బాధితుల కోసం కూటమి ప్రభుత్వం అందిస్తున్న పూర్తి తోడ్పాటును రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన అధునాతన వైద్య సేవలు, ఉచిత డయాలసిస్ సదుపాయాలు మరియు రోగుల ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను ఎయిమ్స్ డైరెక్టర్‌కు కేంద్ర మంత్రి సవివరంగా తెలియజేశారు.
త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటన.. ఉద్దానం పరిధిలో కిడ్నీ వ్యాధుల మూలాలను పూర్తిగా అరికట్టేందుకు, బాధితులకు అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను మరింత దగ్గర చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని ఇరుపక్షాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ క్రమంలోనే, ఉద్దానం ప్రాంతంలో నేరుగా క్షేత్రస్థాయి (Field Visit) పర్యటన జరపాలని, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి మరిన్ని విలువైన వైద్య సూచనలు, ప్రణాళికలు అందించాలని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాస్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరారు. ఇందుకు ఎయిమ్స్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ..
- అనకాపల్లిలో 'సిరివెన్నెల స్మృతివనం'
- ఏపీ ప్రభుత్వం దెబ్బకు దిగొస్తున్న ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు
- రూ.1000 లంచానికి లక్ష బహుమతి.. CM విజయ్ సంచలన నిర్ణయం
- నకిలీ ట్రావెల్ ఆఫర్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- గత 48 గంటల్లో 6 శత్రు డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు
- రేపు 20వ తేదీ దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్
- టాప్-100 IASల్లో తెలంగాణ ఆఫీసర్లు ముగ్గురు
- ఎబోలా భయంతో మూడు దేశాల ప్రయాణికుల ప్రవేశంపై బహ్రెయిన్ ఆంక్షలు
- ఫుజైరాలో తొలి ప్రయాణికుల రైల్వే స్టేషన్ పూర్తి చేసిన ఎతిహాద్ రైల్









