రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- May 20, 2026
రోమ్: ఇటలీ రాజధాని రోమ్ చేరుకున్న భారత ప్రతినిధికి అక్కడ ఆత్మీయ స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న అనంతరం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో విందు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం కొలొస్సియంను సందర్శించారు.
ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారత్-ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం, గ్లోబల్ అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
నేడు జరగనున్న అధికారిక సమావేశాల్లో భారత్-ఇటలీ స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడించారు.
ఇటలీ పర్యటన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం
- రోమ్‌లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









