అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!
- May 20, 2026
కువైట్ః దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో అస్తవ్యస్తంగా పార్కింగ్ చేసే సమస్యను పరిష్కరించడానికి, కువైట్ క్యాబినెట్ షేక్ ఫహద్ అల్-యూసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ గవర్నరేట్‌లలోని ప్రాంగణాలు, పాఠశాలల పార్కింగ్ ప్రాంతాలు, మసీదుల పరిసరాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో వాహనాలు, భారీ పరికరాలు మరియు యంత్రాలను నియంత్రణ లేకుండా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నట్టు తెలిపింది. ఇది ట్రాఫిక్ మరియు పర్యావరణ సవాళ్లను కూడా సృష్టిస్తుందని, వీటికి తక్షణ ప్రభుత్వ జోక్యం అవసరమని హెచ్చరించింది.
ఈ కమిటీలో ప్రజా పనులు, పురపాలక వ్యవహారాలు మరియు గృహనిర్మాణం, ఆర్థిక వ్యవహారాలు మరియు పెట్టుబడులు మరియు ఆర్థిక శాఖల మంత్రులు ఉన్నారు. పార్కింగ్ కోసం స్థలాలను ఇష్టానుసారంగా ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులను ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. మల్టీ ఫ్లోర్ పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా కూడా ఈ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఈ సమస్యపై తీసుకున్న చర్యలు మరియు సాధించిన పురోగతిని వివరిస్తూ, ప్రతి రెండు నెలలకు ఒకసారి క్యాబినెట్‌కు ఒక నివేదికను సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







