ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- May 20, 2026
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ చందాదారులకు కేంద్రం భారీ ఊరటను ప్రకటించింది. ఇకపై సాధారణ బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ ఖాతాను సులభంగా వాడుకునే సదుపాయాన్ని తీసుకువస్తోంది. అత్యవసర సమయాల్లో పీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసుకోవడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా యూపీఐ పేమెంట్ గేట్‌వే ద్వారా నిమిషాల్లో సొమ్మును తీసుకునే రోజులు రాబోతున్నాయి. పీఎఫ్ సొమ్ములో కొంత మొత్తాన్ని ఖాతాల్లో నిల్వ చేసుకుని, ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకునే విధంగా కార్మికశాఖ నూతన విధానాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతిక పరీక్షలు విజయవంతంగా పూర్తిచేసినట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయా మంగళవారం ప్రకటించారు. చందాదారులు ఇక నుంచి గూగుల్ పే, ఫోన్ పే యాప్స్ తరహాలోనే..సభ్యులు తమ లింక్డ్ బ్యాంక్ ఖాతా ద్వారా పీఎఫ్ బ్యాలెన్సును చూసుకోవడంతో పాటు యూపీఐ పిన్ ఉపయోగించి సురక్షితంగా నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన డబ్బును నేరుగా డిజిటల్ పేమెంట్లకు లేదా ఏటీఎం ద్వారా నగదు రూపంలోకి మార్చుకోవచ్చు. ఇదిలా ఉండగా, సభ్యులకు మరింత చేరువకావడానికి ఈపీఎ్‌ఫవో నెలరోజుల్లో వాట్సాప్ సేవలను ప్రారంభించనుంది.
తాజా వార్తలు
- పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్‌కు సువర్ణ సత్కారం
- రోమ్‌లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..









