కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- May 20, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో సామాన్యులకు త్వరలోనే పెద్ద షాక్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వం కరెంట్ బిల్లులను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ అథారిటీ ఒక కీలకమైన విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోలార్ పవర్ వాడకం బాగా పెరుగుతోంది. దీనివల్ల విద్యుత్ కంపెనీలకు రావాల్సిన ఆదాయం తగ్గి నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాల నుంచి డిస్కంలను గట్టెక్కించేందుకు ఫిక్స్డ్ ఛార్జీలను పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
రూఫ్‌టాప్ సోలార్ ఎఫెక్ట్.. నష్టాల్లో డిస్కంలు
చాలా పరిశ్రమలు, సంపన్న కుటుంబాలు తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. దీనివల్ల వారు సొంతంగా కరెంట్ తయారు చేసుకుంటూ గ్రిడ్ నుంచి విద్యుత్ కొనడం తగ్గించేశారు. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే ప్రభుత్వ కరెంట్ వాడుతున్నారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ విద్యుత్ సంస్థలకు రాబడి బాగా పడిపోయింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి, గ్రిడ్ నిర్వహణ ఖర్చులను అందరి నుంచి వసూలు చేయడానికి ఈ కొత్త నిబంధనలు తెస్తున్నారు.
2030 నాటికి కొత్త టారిఫ్.. ఎవరికి ఎంత భారం?
ఈ స్థిర ఛార్జీలను ఒకేసారి కాకుండా దశలవారీగా పెంచుతారు. రాబోయే 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారుల నుంచి 25 శాతం స్థిర ఖర్చులను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో కమర్షియల్, పారిశ్రామిక వినియోగదారుల నుంచి 100 శాతం స్థిర ఛార్జీలను వసూలు చేయనున్నారు. దీనివల్ల మీరు కరెంట్ తక్కువగా వాడినా కూడా నెలవారీ కనీస ఛార్జీల రూపంలో ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







