10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- May 20, 2026
దోహా: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తన 'ఈదియా' (Eidiya) ఏటీఎం సేవలు మే 21నుండి ఖతార్‌లోని వివిధ ప్రదేశాలలో అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. మొత్తం 10 ప్రాంతాల్లో 52 ఏటీఎంలు అందుబాటులో ఉంటాయని, వీటి ద్వారా 5, 10, 50, 100 మరియు 200 విలువ కలిగిన ఖతారీ రియాల్ నోట్లను విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
ఈదియా ATMలు ఉన్న ప్రాంతాలు:
వెండోమ్ మాల్ వద్ద 5 ATMలు
ఖతార్ మాల్ వద్ద 5 ATMలు
అల్ వక్రా ఓల్డ్ సౌక్ వద్ద 5 ATMలు
ఎజ్దాన్ మాల్ వక్రా వద్ద 4 ATMలు
దోహా ఫెస్టివల్ సిటీ (DFC) వద్ద 8 ATMలు
అల్ హజ్మ్ మాల్ వద్ద 5 ATMలు
వెస్ట్ వాక్ వద్ద 5 ATMలు
అల్ ఖోర్ వద్ద 5 ATMలు
అల్ మీరా (Muaither) వద్ద 5 ATMలు
అల్ మీరా (Al-Thumama) వద్ద 5 ATMలు
అధిక నగదు పంపిణీ సామర్థ్యం కలిగిన, కొత్తగా అప్డేట్ చేసిన ATM యంత్రాల ద్వారా ఈ సర్వీస్ పనిచేస్తుందని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
చిన్న పిల్లలకు డబ్బును బహుమతిగా ఇచ్చే సంప్రదాయమైన ‘ఈదీ ’ ఆచరణకు సంబంధించిన ఖతార్ వారసత్వాన్ని మరియు సంస్కృతిని పరిరక్షించే సమగ్ర ప్రయత్నంలో భాగంగా ఈ సేవ అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









