సెర్న్‌ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!

- May 20, 2026 , by Maagulf
సెర్న్‌ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!

జెనీవా: అంతర్జాతీయ శాస్త్రీయ పరిశోధన వ్యవస్థలో ఒమన్ సుల్తానేట్ ఉనికిని పెంపొందించే కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఒమన్ విద్యా మంత్రిత్వ శాఖ జెనీవాలోని యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థతో కుదిరిన ఒక శాస్త్రీయ మరియు సాంకేతిక సహకార ఒప్పందంపై సంతకం చేసింది.

ఈ ఒప్పందంపై ఒమన్ తరఫున స్విస్ కాన్ఫెడరేషన్‌కు ఒమన్ సుల్తానేట్ రాయబారి  మహమూద్ హమద్ అల్ హసానీ మరియు సెర్న్ సంస్థ తరఫున యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ డైరెక్టర్-జనరల్ అయిన ప్రొఫెసర్ మార్క్ థామ్సన్ సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా హై-ఎనర్జీ ఫిజిక్స్ రంగంలో ఉమ్మడి సహకారానికి ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా,  సైంటిఫిక్ నాలెడ్జ్, లాబోరేటరీ సేవలను షేర్ చేసుకునే వెలసులుబాటు కలుగుతుంది. అలాగే, ప్రయోగాత్మక మరియు థియోరాటికల్ ఫిజిక్స్, యాక్సిలరేటర్ ఇంజనీరింగ్, కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మరియు అధునాతన మెటీరియల్స్ సైన్స్ వంటి రంగాలలో సెర్న్ పరిశోధన మరియు శిక్షణా కార్యక్రమాలలో చేరడానికి ఒమన్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు విద్యార్థులకు ఇది మార్గం సుగమం చేస్తుంది.

ఈ భాగస్వామ్యం హిజ్ మెజెస్టి సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ నాయకత్వంలో విజ్ఞాన ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా ఒక స్పష్టమైన మార్గాన్ని సూచిస్తుందని స్విస్ కాన్ఫెడరేషన్‌లోని ఒమన్ సుల్తానేట్ రాయబారి తెలియజేశారు.   ఈ ఒప్పందం ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుందన్నారు. ఆ తర్వాత ఆటోమెటిక్ గా రెన్యూవల్ అవుతుందన్నారు. 

యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రీయ పరిశోధనా కేంద్రాలలో ఒకటి. దీనిలో 23 సభ్య దేశాలు పాలుపంచుకుంటున్నాయి. అనేక ఇతర దేశాలు ఒప్పందాల ద్వారా సేవలు పొందుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com