తమిళనాడులో విజయ్ క్యాబినెట్ విస్తరణ..21మంది టీవీకే, ఇద్దరు కాంగ్రెస్..
- May 21, 2026
చెన్నై: తమిళనాడులో టీవీకే విజయ్ క్యాబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన మంత్రివర్గంలో 23మంది ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. వీరిలో టీవీకే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులచేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
మే10వ తేదీన జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తొమ్మిది మంది టీవీకే ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా మరో 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో విజయ్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 32కు చేరింది. మొత్తం 35మంది కేబినెట్లో మంత్రులుగా ఉండొచ్చు. ఇంకా మరో ముగ్గురిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరిగిన మంత్రివర్గం విస్తరణంలో వీసీకే, ఐయూఎంఎల్ భాగస్వామ్యం కాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే రెండు మంత్రి పదవులు దక్కాయి. అయితే, ప్రస్తుతం ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్లను సంకీర్ణ మంత్రివర్గంలో లాంఛనంగా చేరాలని టీవీకే నాయకత్వం ఆహ్వానిస్తూనే ఉంది. ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో టీవీకే, ఐయూఎంఎల్ పార్టీలకు దక్కే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







