ఒమాన్‌లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- July 12, 2026
మస్కట్: ఒమాన్‌లోని ముసందమ్ గవర్నరేట్ పరిధిలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగినట్లు ఆ దేశ భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనను ఒమాన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది.
ఒక భద్రతా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ముసందమ్ ప్రాంతంలోని కొన్ని ప్రదేశాల పై డ్రోన్లతో దాడి జరిగినట్లు నిర్ధారించారు. అయితే దాడుల వల్ల జరిగిన నష్టం లేదా ప్రాణనష్టం గురించి అధికారులు ఇప్పటి వరకు వివరాలు వెల్లడించలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశ భద్రతను బలోపేతం చేసేందుకు, ప్రజలు మరియు దేశంలో నివసిస్తున్న వారందరి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒమాన్ ప్రభుత్వం ప్రకటించింది.
దాడి వెనుక ఉన్న కారణాలు, బాధ్యులపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







