ఇ-మ్యారేజ్ కాంట్రాక్ట్ సిస్టమ్ సిద్ధం
- August 08, 2016
మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండర్ సెక్రెటరీ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా నాజర్, ఇ-మ్యారేజీ కాంట్రాక్ట్ కొద్ది వారాల్లోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మినిస్ట్రీ నుంచి వచ్చే ఈ అప్లికేషన్, పార్టీల నుంచి కాంట్రాక్ట్‌కి మధ్య హక్కుల్ని రక్షిస్తుందని తెలిపారాయన. మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఈ ఏడాది 170,000కి పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. మ్యారేజ్ కాంట్రాక్ట్ అధికారులకు సహకారం అందించే దిశగా జస్టిస్ మినిస్ట్రీ ఈ ప్రోగ్రామ్‌ని రూపొందించింది. జస్టిస్ మినిస్ట్రీ 6,533 మంది మ్యారేజ్ కాంట్రాక్ట్ అధికారులకు ఈ విధానం ద్వారా శిక్షణ ఇప్పించనుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్‌మెంట్, సోషల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ మరియు స్పెషలైజ్డ్ సొసైటీలకు ఫ్యామిలీ ఎఫైర్స్‌లో సమస్యలను సరిదిద్దేలా ప్రోత్సాహాన్నిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్లా. 686 సోషల్ డెవలప్‌మెంట్ సెంటర్స్, 6,533 కాంట్రాక్ట్ అధికారులతో సేవలు అందిస్తున్నామనీ, దురదృష్టవశాత్తూ 40,000 డైవోర్స్ కాంట్రాక్ట్‌లను ఇవ్వాల్సి వచ్చిందనీ, ఇవి కుటుంబాలను విభజించాయనీ, అలాగే అదృష్టవశాత్తూ 144,00 మ్యారేజ్ కాంట్రాక్ట్స్ ఇవ్వగలిగామని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







