తల్లి వేధింపులు: 14 ఏళ్ళ బాలికకి రక్షణ
- August 08, 2016
దుబాయ్ పోలీసులు, 14 ఏళ్ళ బాలికను, ఆమె తల్లి నుంచి రక్షించారు. పదే పదే బాధితురాలికి తల్లి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని పోలీసులు వెల్లడించారు. అల్ క్వాసిస్ పోలీస్ స్టేషన్ చీఫ్ ఆఫ్ ది హ్యాపీనెస్ సెక్షన్ లిలా షామారాద్ మాట్లాడుతూ, తమ డిపార్ట్‌మెంట్ బాధితురాలి కష్టం గురించిన సమాచారం అందుకోగానే, వెంటనే డొమెస్టిక్ వైలెన్స్ కింద చర్యలు తీసుకున్నామని చెప్పారు. శారీరకంగా తన తల్లి తనను వేధిస్తోందనీ, టార్చర్ చేస్తోందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. బాధితురాల్ని పోలీసులు ఫోరెన్సిక్ విభాగాకి అప్పగించారు. బాధితురాల్ని ఆమె తల్లి వేధించినట్లు గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. నిందితురాలైన తల్లికి ఓ కొడుకు ఉన్నాడనీ, అతన్ని మాత్రం ఆమె బాగా చూసుకుంటోందని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







