తెలంగాణ పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- May 23, 2026
--స్మార్ట్ పోలీసింగ్ కోసం ప్రత్యేక టెక్ టీమ్ ఏర్పాటు దిశగా చర్చలు
హైదరాబాద్: తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థను మరింత స్మార్ట్‌గా, సాంకేతికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక చర్యలు చేపడుతోంది.ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌లో విస్తృతంగా వినియోగించే అంశాలపై చర్చించారు. పోలీస్ సేవలను వేగవంతం చేయడం, నేరాల విచారణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, డేటా ఆధారిత నిర్ణయాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రత్యేక టెక్ టీమ్‌ను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అదేవిధంగా ప్రస్తుతం అమల్లో ఉన్న CCTNS (Crime and Criminal Tracking Network System), HRMS (Human Resource Management System), Hawkeye వంటి వ్యవస్థలను పరస్పరం అనుసంధానం చేసి సమగ్ర డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థగా అభివృద్ధి చేసే అంశంపై అధికారులు చర్చించారు.
పోలీస్ శాఖలో సాంకేతికత వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్‌పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!
- తెలంగాణ పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి కార్యాచరణ: డీజీపీ సీవీ ఆనంద్
- సీఎం చంద్రబాబును కలిసిన అపోలో ప్రీతారెడ్డి
- యాదగిరిగుట్టలో అతిపెద్ద వేద పాఠశాల సముదాయానికి భూమిపూజ చేసిన సీఎం రేవంత్
- భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి
- యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించిన సీఎం రేవంత్









