ఏప్రిల్‌లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!

- May 25, 2026 , by Maagulf
ఏప్రిల్‌లో అబ్షర్ లో 16.5 మిలియన్లకు పైగా ఎలక్ట్రానిక్ లావాదేవీలు..!!

రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్ అబ్షర్.. ఏప్రిల్ నెలలో మొత్తం 16,536,826 (16.5 మిలియన్లకు పైగా) ఎలక్ట్రానిక్ లావాదేవీలు మరియు సేవలను నిర్వహించింది.  

అబ్షర్ ఇండివిడ్యువల్స్ ద్వారా మొత్తం 13,973,584 (13.9మిలియన్) లావాదేవీలు పూర్తయ్యాయి. వీటిలో, అబ్షర్ యాప్ ద్వారా పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అందుబాటులో ఉన్న డిజిటల్ వాలెట్ ఫీచర్ ద్వారా జరిగిన 3,609,072 (3.6మిలియన్) డాక్యుమెంట్-వ్యూయింగ్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. అబ్షర్ బిజినెస్ 2,563,242 (2.5 మిలియన్) లావాదేవీలను నమోదు చేసింది.

జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీకి సంబంధించిన లావాదేవీలు 3,417,847(3.4మిలియన్)కి చేరుకున్నాయి. ఇందులో జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ ద్వారా 3,307,760(3.3 మిలియన్) సేవలు కూడా ఉన్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ 2,202,603(2.2మిలియన్) లావాదేవీలను నమోదు చేయగా, మంత్రిత్వ శాఖకు చెందిన ఏజెన్సీ ఆఫ్ సివిల్ అఫైర్స్ 576,236 (0.5మిలియన్) లావాదేవీలను పూర్తి చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com