సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- May 25, 2026
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రం అందజేశారు.
జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో నిర్వహించనున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ 19వ తెలుగు మహాసభలకు హాజరుకావాలని ముఖ్యమంత్రిని వారు ఆహ్వానించారు. తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిని ఒక వేదికపైకి తీసుకురావడంలో ఈ మహాసభలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







