జ్యోతిలక్ష్మి తుది శ్వాస విడిచారు
- August 08, 2016
300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి(63) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మి పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. గాంధర్వ కన్య, సీతారాములు, కలుసుకోవాలని, బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.ఐటమ్ సాంగ్స్ తో ఊపు ఊపేసిన జ్యోతిలక్ష్మి పెళ్లి తరువాత సినిమాలకు దూరమయ్యారు.. చాలా కాలం పాటు మీడియా కంట పడకుండా ఉన్న జ్యోతిలక్ష్మి, తరువాత బుల్లితెరపై హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు.గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆ మృతికి పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







