జపాన్ చక్రవర్తి పదవిని త్యజించడానికి సంకేతాలు..
- August 08, 2016
ఆరోగ్యం బలహీనపడటంతో తన విధులు నిర్వర్తించడం కష్టంగా మారిందంటూ జపాన్ చక్రవర్తి అకిహిటో(82) ఆందోళన వ్యక్తం చేశారు. వయసు అడ్డంకిగా మారిందనీ, శరీరక ఆరోగ్యానికి సంబంధించిన పరిమితులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. జాతిని ఉద్దేశించి చేసిన వీడియో ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పదవీ పరిత్యాగానికి సంబంధించిన ప్రస్తావనేదీ చేయకపోయినా.. భవిష్యత్తులో పదవిని త్యజించడానికి సంకేతాలుగా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ప్రధాని షింజో అబే వెంటనే స్పందించారు. చక్రవర్తి వ్యాఖ్యల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. చక్రవర్తి విధులు, ఆరోగ్యం, పని ఒత్తిడి వంటివన్నీ దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలనేది యోచిస్తామన్నారు. మరి కొన్నేళ్లలో తాను పదవి నుంచి వైదొలగనున్నట్లు సన్నిహితులతో పేర్కొన్నట్లు గత నెలలోనే పలు కథనాలు వెలువడ్డాయి. ఇది ఆధునిక జపాన్ చరిత్రలో మునుపెన్నడూ లేని పరిణామంగా భావిస్తున్నారు. చక్రవర్తి అభిప్రాయంపై సామాన్య ప్రజల్లో విస్తృత మద్దతు ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







