11-12 తేదీల్లో ఉల్కల వర్షం!....

- August 08, 2016 , by Maagulf
11-12 తేదీల్లో ఉల్కల వర్షం!....

ఆకాశం నుంచి భూమి వైపుకు దూసుకొస్తున్న ఉల్కలు భూవాతావరణంలోకి రాగానే భగభగమండుతూ అదృశ్యమైపోయే అద్భుత దృశ్యం రెండు రోజుల్లో కనువిందుచేయనుంది. ప్రతీ 133 ఏళ్లకోసారి సూర్యుడి చుట్టూ తిరిగే స్విఫ్ట్-టటిల్ తోక చుక్క ఉల్కల మార్గం గుండా భూమి కక్ష్య వెళ్తుండడంతో ఈ ఆకాశ అద్భుతం ఆవిష్కృతం కానుంది. దీన్ని మనం నేరుగా చూడొచ్చు. ఆగస్ట్ 11-12 తేదీల్లో రాత్రిపూట గంటకు దాదాపు 200 ఉల్కలు భూమిపైకి దూసుకొచ్చే అవకాశముందని నాసా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com