పుష్కరాలకు ఎన్నారైలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ఏపీఎన్ఆర్టీ

- August 09, 2016 , by Maagulf
పుష్కరాలకు ఎన్నారైలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించిన ఏపీఎన్ఆర్టీ

కృష్ణా పుష్కారాల సందర్భంగా ప్రవాసమిత్రులకి వివిఐపీ ల ఘాట్ “పుష్కర ఘాట్” ని కేటాయించడం జరిగిందని ఏపీఎన్ఆర్టీ​ సీఈఓ​ వేమూరి రవి కుమార్ గారు మాగల్ఫ్.కామ్ కి తెలిపారు. పుష్కర ఘాట్ దగ్గర ఏపీఎన్ఆర్టీ​  సెల్ దగ్గర ఎన్నారై ప్రూఫ్ చూపించి ఈ అవకాశాన్ని సద్వినియోగాపరుచుకోవాలని తెలిపారు. అలాగే ఈ ఘాట్ వద్ద ఎన్నారైలకి ఏపీఎన్ఆర్టీ​ ప్రత్యెక సదుపాయాలని కలుగజేస్తోందని వేమూరి రవి కుమార్ తెలిపారు.

పున్నమి ఘాట్‌: హైదరాబాద్‌, ఖమ్మం, భద్రాచలం మార్గంలో వచ్చే భక్తులకు అనువుగా ఎన్‌హెచ్‌-65 జాతీయ రహదారికి సమీపంలో ‘పున్నమి ఘాట్‌’ను అభివృద్ధి చేశారు.  పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన పున్నమి హోటల్‌ సమీపంలో ఈ ఘాట్‌ ఉంది. 700మీటర్ల మేర ఘాట్‌ నిర్మాణం జరిగింది. సమీపంలోనే పుష్కరనగర్‌లు, పిండప్రదాన కేంద్రాలను సిద్ధం చేశారు. పుష్కర ఘాట్ విజయ డెయిరీ ఇంటేక్ వెల్ నుండి పున్నమి రెస్టారెంట్ గోడ వరకూ విస్తరించి ఉంది. 

అలాగే రోడ్ పాస్ లు లభించలేదని , రోడ్ పాస్ లు లేకపోయినా నిరాశ పడవద్దని ప్రత్యెక వి ఐ పి హోదాలో పుష్కరఘాట్ లో ఏర్పాట్లు జరిగాయని వేమూరి రవి కుమార్ తెలిపారు.

ప్రవాస మిత్రుల కోసం బస్ నిలుపు స్థలాలు, పార్కింగ్ స్థలాలు, పున్నమి పుష్కర ఘాట్ దగ్గరికి ఉచిత బస్ సౌకర్యవివరాలు:

గోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వద్ద ఉన్న తాత్కాలిక బస్టాండ్‌ వద్ద ఆగిపోతాయి. ఉత్తరాంధ్ర జిల్లాల బస్సులు వైవీరావు ఎస్టేట్స్‌ వద్ద; హైదరాబాద్‌ నుంచి వచ్చే బస్సులు జాకీర్‌ హుస్సేన్‌ కాలనీ వద్ద; తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులు వీటీపీఎస్‌ (ఏ) కాలనీ వద్ద; అవనిగడ్డ, మచిలీపట్నం, భీమవరం, నరసాపురం నుంచి సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ వద్ద ఆపేస్తారు. ఇక అక్కడినుండి వాహనాలలో వెళ్ళేవాళ్ళకి పార్కింగ్ స్థలాలు ఇదిగో.

ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా నేరుగా ప్రధాన రోడ్ల మీదకు చేరుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయే అవకాశాన్ని కల్పించారు. నగర వ్యాప్తంగా గుర్తించిన పార్కింగ్‌ ప్లేస్‌లలో మొత్తం 62,750 ద్విచక్రవాహనాలు, 6270 కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. పుష్కర స్నానం ముగించుకుని, ఇతర కార్యక్రమాలను చక్క బెట్టుకోవటానికి ఎంత లేదన్నా ఐదు గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన రోజుకు లక్షన్నర వరకు ద్విచక్ర వాహనాలు, 20 వేల వరకు కార్లను పార్కింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. 

వారధి ఏరియా (ఏలూరు సైడ్‌ – గుంటూరు సైడ్‌)

దూరదూర్శన్‌ ఓపెన్‌ సైట్‌, ఫీడర్‌ రోడ్డు,
పొట్టి శ్రీరాములు స్కూల్‌, క్రష్ణ్ణలంక

ఇబ్రహీంపట్నం – గొల్లపూడి వై జంక్షన్‌

గొల్లపూడి వై జంక్షన్‌ – స్వాతి సెంటర్‌,
గొల్లపూడి వై జంక్షన్‌ – కుమ్మరిపాలెం :

మార్బుల్‌ యార్డ్‌ , గొల్లపూడి
షాదీఖానా, కుమ్మరిపాలెం
(గుప్తా సెంటర్‌)
కాళేశ్వరరావు మార్కెట్‌ ఏరియా

వక్డ్‌బోర్డు ఖాళీ స్థలం, ఇందాద్‌
ఘర్‌ (కేఆర్‌ మార్కెట్‌ ఎదురుగా)
వన్‌ ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదురుగా :
తారాపేట – వెస్ట్‌ బుకింగ్‌ ఏరియా

కృష్ణ్ణవేణి క్లాత్‌ మార్కెట్‌ సెల్లార్‌
కాల్టెక్స్‌ రోడ్డు, మెయిన్‌ రైల్వే స్టేషన్‌

పాత ప్రభుత్వ హాస్పిటల్‌
దగ్గర ఖాళీ స్థలం
ఆంధ్రపత్రిక ఓపెన్‌ సైట్‌
జింఖానా గ్రౌండ్స్‌, గాంధీనగర్‌
సత్యనారాయణపురం రైల్వే ఇన్‌స్టిట్యూట్‌

మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ ఎదురు (కేంద్రీయ విద్యాలయం)
ఎంజీ రోడ్‌

ఐదవ నెంబర్‌ రూట్‌

బిషప్‌ అజరయ్య స్కూల్‌, రెడ్‌ సర్కిల్‌
సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, పిన్నమనేని పాలీక్లినిక్‌ రోడ్డు
చుట్టుగుంట – సీతారామపురం

శాతవాహన కాలేజి
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు – రామవరప్పాడు జంక్షన్‌, గొల్లపూడి వై జంక్షన్‌ – నున్న బైపాస్‌, మ్యాంగో మార్కెట్‌

మాకినేని బసవపున్నయ్య స్టేడియం , అజిత్‌సింగ్‌ నగర్‌
రోహిత్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ , పైపుల రోడ్డు
గుణదల రైల్వేస్టేషన్‌ గ్రౌండ్‌ ఎదురుగా :
వైవీ రావు ఎస్టేటు ఓపెన్‌ సైట్‌

వైవీ రావు ఎస్టేటు స్థలం (ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు)
రమేష్‌ హాస్పిటల్‌ ఏరియా

ఆంధ్రా లయోల కాలేజీ గ్రౌండ్స్‌,  

అలాగే ఈ పార్కింగ్ స్థలాలనుండి

ప్రత్యేక ఉచిత బస్సుల వివరాలు 
1. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నుంచి 60 (1పీ, 1బీ, 1ఎస్‌) 
2. వైవీరావు ఎస్టేట్స్‌ నుంచి 50 (2పీ, 2బీ, 2ఎస్‌) 
3. జాకీర్‌ హుస్సేన్‌ కాలనీ నుంచి 55 (3పీ, 3బీ, 3ఎస్‌) 
4. వీటీపీఎస్(ఏ)కాలనీ నుంచి 30 (4పీ, 4బీ, 4ఎస్‌) 
5. సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి 35 
(5పీ, 5బీ, 5ఎస్‌)

*****
6. విజయవాడ ఈస్ట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి: 50 
7. విజయవాడ వెస్ట్‌ రైల్వే స్టేషన్‌ నుంచి: 25 
8. మధురానగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి: 10 
9. రాయనపాడు రైల్వే స్టేషన్‌ నుంచి: 15 
(గమనిక: బస్సు నంబర్లలో పీ-అంటే పద్మావతి, కృష్ణవేణి, దుర్గ ఘాట్లకు... బీ-భవాని, పున్నమి ఘాట్లకు.. సీ- సంగమం ఘాట్లకు వెళ్లే బస్సులు)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com