గ్లోబల్ ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్..ఒమన్ కు ఫస్ట్ ర్యాంక్..!!
- June 02, 2026
మస్కట్: ప్రపంచ బ్యాంకు 2025 లాజిస్టిక్స్ పనితీరు సూచిక (LPI) నివేదికలోని అనేక సూచికలలో ఒమన్ సుల్తానేట్ మెరుగైన ప్రాంతీయ మరియు గ్లోబల్ ర్యాంకులను సాధించింది.
ఎక్స్ పోర్టు సఫ్లై చైన్ స్టార్టప్ ఇండెక్స్ లో ఒమన్ కేవలం 0.8 రోజుల రికార్డు సమయంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని సాధించింది. ఈ విజయం దాని లాజిస్టిక్స్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరియు ణిజ్య ప్రక్రియల వేగాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు.
LPI అనేది ఒక ఖాళీ కంటైనర్ బయలుదేరినప్పటి నుండి ఓడరేవు ద్వారా ఎగుమతికి సిద్ధంగా, సరుకులతో తిరిగి వచ్చే వరకు పట్టే పూర్తి సైకిల్ సమయాన్ని కొలుస్తుంది. ఇది ఒమన్ ఓడరేవులలో కంటైనర్ నిర్వహణ అధిక కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు వేగాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇంపోర్ట్ సప్లై చైన్ కంప్లిషన్ ఇండెక్స్ లో 165 దేశాలలో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఈ సూచిక, ఒక కంటైనర్‌ను వినియోగదారునికి డెలివరీ చేసినప్పటి నుండి అది ఖాళీగా వేర్ హౌజ్ కి తిరిగి వచ్చే వరకు పట్టే సమయాన్ని లెక్కిస్తోంది. ఇది దిగుమతి కార్యకలాపాల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది.
GCCలో "ప్రత్యక్ష షిప్పింగ్ లైన్ల సేవలు" (Direct Shipping Lines Services) ఇండెక్స్ లో ఒమన్ మూడవ స్థానంలో నిలిచింది. ఇది దేశంలోని ఓడరేవులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఓడరేవులకు అనుసంధానించే క్రమబద్ధమైన షిప్పింగ్ సేవల సంఖ్యను గణించి ర్యాంకులను కేటాయిస్తుంది.
"షిప్పింగ్ అలయన్సెస్ సంఖ్య" (Number of Shipping Alliances) సూచికలో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 169 దేశాలలో 25వ స్థానంలో మరియు GCCలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ సూచిక, కార్యాచరణ మరియు వాణిజ్య కార్యకలాపాలను సంయుక్తంగా నిర్వహించడంలో షిప్పింగ్ లైన్ల మధ్య సహకార స్థాయిని లెక్కిస్తుంది.
సాధారణ షిప్పింగ్ లైన్ల ద్వారా ఒమన్ ఓడరేవుల నుండి నేరుగా చేరుకోగల మార్కెట్ల సంఖ్యను కొలిచే "ప్రత్యక్ష షిప్పింగ్ కనెక్టివిటీ పార్టనర్స్ సంఖ్య" సూచికలో సుల్తానేట్ ప్రపంచవ్యాప్తంగా 39వ స్థానంలో మరియు గల్ఫ్ ప్రాంతంలో మూడవ స్థానంలో నిలిచి సత్తా చాటింది.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







