గాయని లక్ష్యంగా..అభ్యంతరకరమైన స్నాప్‌చాట్ పోస్టులు..కవికి జైలుశిక్ష..!!
- June 02, 2026
మనామా: ప్రముఖ బహ్రెయిన్ గాయనిని అభ్యంతరకరమైన స్నాప్‌చాట్ పోస్టుల ద్వారా వేధించినందుకు ఒక కవిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును బహ్రెయిన్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది. 2024లో గాయని స్నాప్‌చాట్ ఖాతాలో అవమానకరమైన, కించపరిచే వ్యాఖ్యలను ప్రచురించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగా ఆమెకు మనోవేదన కలిగించాడని కోర్టు నిర్ధారించింది.
గాయని ఫిర్యాదు మేరకు కమ్యూనికేషన్ పరికరాలను దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగాలు మోపింది. దిగువ కోర్టు మొదట నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసి, సంబంధిత సివిల్ కేసును కొట్టివేసింది. అయితే, ఆ తర్వాత హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆ తీర్పును రద్దు చేసి, నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఇరు పక్షాల మధ్య వృత్తిపరమైన సంబంధం దెబ్బతిన్న తర్వాత, స్నాప్‌చాట్ పోస్టులను ప్రచురించినట్లు కోర్ట తన తీర్పులో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







