డాలస్‌లోని మహాత్మా గాంధీ స్మారక స్థలిని సందర్శించిన జయరాం కోమటి
- June 02, 2026
అమెరికా: ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి డాలస్ నగర పర్యటనలో ఉన్న జయరాం కోమటి అర్వింగ్ (డాలస్) లో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మా గాంధీ స్మారక స్థలిని ఆదివారం సందర్శించి బాపూజీకి పుష్పాంజలి ఘటించారు.
మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్
బోర్డు సభ్యులు అనంత్ మల్లవరపు జయరాంకు స్వాగతం పలికి జ్ఞాపికతో సన్మానించారు.
ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్ళపల్లి మరియు పలువురు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జయరాం మాట్లాడుతూ.. "పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న ఈ గాంధీ స్మారకస్థలి కేవలం ప్రవాసభారతీయులకే గాక ఇతర దేశస్తులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అమెరికన్ రాజకీయ నాయకులు సైతం సందర్శించే ఒక స్ఫూర్తి దాయకమైన యాత్రాస్థలి అని ప్రకటించారు.
ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని, ఈ మహత్కార్యాన్ని సాకారం చెయ్యడంలో విశేష కృషి సల్పిన గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మరియు వారి కార్యవర్గ బృందానికి ప్రత్యేక అభినందనలు అన్నారు".
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







