చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- June 02, 2026
చండీగఢ్: కేంద్ర విద్యుత్, గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన చండీగఢ్‌లో నిర్వహించిన విద్యుత్ సంబంధిత సంప్రదింపుల కమిటీ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో దేశంలోని విద్యుత్ రంగ అభివృద్ధి, విద్యుత్ సరఫరా వ్యవస్థ బలోపేతం, పునరుత్పాదక ఇంధన వినియోగం, విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు మెరుగుదల తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి తమ పార్లమెంటరీ నియోజకవర్గం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగ సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తన అభిప్రాయాలను సమావేశంలో వెల్లడించారు.
దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో జరుగుతున్న సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై సభ్యులతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పలువురు పార్లమెంట్ సభ్యులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్‌లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









