జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- June 03, 2026
జర్మనీ: 2026 జూన్ 3 నుంచి జర్మనీ మీదుగా ప్రయాణించే భారతీయులకు ఒక అదిరిపోయే వార్త. ఇకపై జర్మనీలో విమానం మారేందుకు (లేఓవర్) ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌లలో విమానాలు మారే ప్రయాణికులకు ఈ కొత్త నిబంధన ఎంతో ఊరటనిస్తుంది. అయితే, ఇది కేవలం ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ జోన్‌లలో ఉండేవారికి మాత్రమే వర్తిస్తుంది. నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే వేలాది మంది భారతీయులకు ఈ నిర్ణయం పెద్ద భారాన్ని తగ్గిస్తుంది. భారతీయ నిపుణులు, విద్యార్థుల ప్రయాణాలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా జర్మనీ విదేశాంగ శాఖ ఈ మార్పులు చేసింది. గతంలో ఉన్న కఠినమైన ట్రాన్సిట్ రూల్స్ వల్ల ప్రయాణికులు ఎంతో కన్ఫ్యూజ్ అవ్వడమే కాకుండా, అదనపు ఖర్చులు కూడా భరించాల్సి వచ్చేది.
ప్రయాణికులకు మరిన్ని ఫ్లైట్ ఆప్షన్లు అందుబాటు
ఇప్పటికే ఫ్రాన్స్ ఇలాంటి ఆంక్షలను తొలగించగా, ఇప్పుడు జర్మనీ కూడా అదే బాటలో నడిచింది. దీనివల్ల పేపర్ వర్క్ తగ్గుతుంది, ప్రయాణికులకు మరిన్ని ఫ్లైట్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా వంటి ప్రాంతాలకు వెళ్లే భారతీయ పర్యాటకులు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా జర్మనీ మీదుగా వెళ్లవచ్చు. జూన్ 3 నుంచి భారతీయులకు జర్మనీ ట్రాన్సిట్ వీసా కష్టాలు తీరనున్నాయి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ట్రాన్సిట్ వీసాకు, షెంజెన్ వీసాకు చాలా తేడా ఉంది. ఎయిర్‌పోర్ట్ లోపల సురక్షిత ప్రాంతంలో మాత్రమే ఉండేవారికి ట్రాన్సిట్ వీసా అవసరం లేదు. కానీ, మీరు ఎయిర్‌పోర్ట్ దాటి బయటకు రావాలన్నా లేదా నగరాన్ని చూడాలనుకున్నా ఖచ్చితంగా ‘షెంజెన్ సి’ (Schengen C) వీసా ఉండాల్సిందే. జర్మనీ ట్రాన్సిట్ వీసా రద్దుతో కలిగే ప్రయోజనాలు ఇవే.. ఈ నిర్ణయంతో లుఫ్తాన్స (Lufthansa) వంటి దిగ్గజ విమాన సంస్థలకు భారత్ నుంచి బుకింగ్స్ భారీగా పెరుగుతాయని అంచనా. విమాన సంస్థల మధ్య పోటీ పెరగడం వల్ల పాపులర్ రూట్లలో టికెట్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా యూకే (UK) వెళ్లే విద్యార్థులకు ఈ తక్కువ ధరలు ఎంతో మేలు చేస్తాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







