క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- June 03, 2026
కువైట్ సిటీ: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు పౌర మౌలిక సదుపాయాల లక్ష్యంగా ఇరాన్ జరిపిన దాడుల్లో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సలేం అల్-సబా పరామర్శించారు. బుధవారం ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు కువైట్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది.
బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్న రక్షణ మంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పౌర ప్రాంతాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల నేపథ్యంలో బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









