హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- June 03, 2026
అబూధాబి: హిజ్రీ నూతన సంవత్సరం (1448) సందర్భంగా 2026 జూన్ 15, సోమవారం యూఏఈలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అధికారిక సెలవుగా ప్రకటించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ (MOHRE) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
యూఏఈ కేబినెట్ ఆమోదించిన 2026 అధికారిక సెలవుల జాబితా ప్రకారం ఈ సెలవు ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. సాధారణ కార్యాలయ పనులు జూన్ 16, మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయి.
సెలవు సోమవారం రావడంతో శని, ఆదివారాలు వారాంతపు సెలవులు ఉండే ఉద్యోగులకు మూడు రోజుల లాంగ్ వీకెండ్ లభించనుంది. ఇక షార్జాలో నాలుగు రోజుల పని విధానం అమలులో ఉండటంతో, శుక్రవారం, శనివారం, ఆదివారం ఇప్పటికే సెలవులు పొందే ప్రభుత్వ ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఈసారి నాలుగు రోజుల విరామం లభించనుంది.
ఇటీవలే ఈద్ అల్ అదా సందర్భంగా యూఏఈలో ఈ ఏడాది ఎక్కువ సెలవులు లభించాయి. ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం తొమ్మిది రోజుల విరామం, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఆరు రోజుల సెలవు పొందిన అనంతరం మరోసారి దీర్ఘ విరామం లభించనుంది.
ఇస్లామిక్ నూతన సంవత్సరం లేదా హిజ్రీ నూతన సంవత్సరం ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రారంభాన్ని సూచిస్తుంది. హిజ్రీ క్యాలెండర్లో తొలి నెల అయిన ముహర్రం మొదటి రోజున ఈ పర్వదినం జరుపుకుంటారు. చంద్ర దర్శనం ఆధారంగా ఈ తేదీని అధికారికంగా నిర్ణయిస్తారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







