గంటకు 1,200 కిలోమీటర్లు: దుబాయ్ ఆసక్తి
- August 09, 2016
సబ్ సానిక్ ప్రొపల్షన్ ట్యూబ్ అనే కొత్త టెక్నాలజీ ద్వారా ప్రయాణీకుల్ని గంటకు 1,200 కిలోమీటర్ల వేగంతో గమ్యస్థానాలకు చేర్చే రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు దుబాయ్ ప్రయత్నాల్ని ప్రారంభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందకు పైగా ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు, వచ్చే నెలలో 40 గంటలపాటు నిర్వహించే క్యాక్రమంలో ఈ ప్రాజెక్టు కోసం పోటీ పడి తమ డిజైన్లను, తమ ఆలోచనల్ని అందించనున్నాయి. హైపర్ లూప్ అని పిలవబడ్తున్న ఈ కొత్త రవాణా మార్గాన్ని దుబాయ్ నుంచి ఫుజారియా మధ్య 127 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ దూరాన్ని కేవలం 10 నిమిషాల్లో హైపర్‌లూప్‌తో చేరుకునే అవకాశాలున్నాయి. తక్కువ ఒత్తిడితో నిండి ఉండే ఓ ట్యూబ్ ఈ రవాణా మార్గంలో అత్యంత కీలకం. హైపర్ లూప్ డిజైన్‌ని తొలిసారిగా 2010లో తెరపైకి తీసుకొచ్చింది ఎలాన్ రీవ్ మస్క్. వచ్చే నెలలో జరిగే కాంపిటీషన్ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కాంపిటీషన్, దుబాయ్‌ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







