ప్రపంచవ్యాప్తంగా హ్యుమటేరియన్ సేవల్లో కువైట్ ఛారిటీస్..!!
- June 07, 2026
కువైట్: కువైట్ స్వచ్ఛంద సంస్థలు బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఫుడ్, విద్యా ప్రాజెక్టుల ద్వారా అనేక దేశాలలో తమ మానవతా మరియు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.
కైరోలోని కువైట్ ఆఫీస్ ఫర్ ఛారిటీ ప్రాజెక్ట్స్, కువైట్ జకాత్ హౌస్ నిధులతో తన వార్షిక ఈద్ అల్-అధా త్యాగ ప్రాజెక్టును వరుసగా 39వ సంవత్సరం కూడా అమలు చేసినట్లు ఆఫీస్ డైరెక్టర్ జమాల్ అల్-మజ్దాలీ తెలిపారు. ఈజిప్టు లోని 11 గవర్నరేట్లలోని అనాథలకు, తక్కువ ఆదాయ కుటుంబాలకు, బలహీన వర్గాల కుంటుంబాలకు సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కువైట్ మరియు ఈజిప్టు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ఛారిటీ ఆర్గనైజేషన్ (IICO) కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్ రహమాన్ అల్-ముతావా మాట్లాడుతూ.. తమ సంస్థ సేకరించిన మాంసాన్ని 18 దేశాల్లోని 2,34,000 మందికి పైగా లబ్ధిదారులకు మొత్తం 2,68,402 కువైట్ దినార్ల (KD) ఖర్చుతో పంపిణీ చేసిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును 13 భాగస్వామ్య సంస్థలు, ఐదు విదేశీ కార్యాలయాలు, కువైట్‌లోని నాలుగు స్వచ్ఛంద బృందాల సహకారం అందించాయని తెలిపారు.
నమా ఛారిటీ అభివృద్ధి మరియు సహాయక విభాగాధిపతి ఖలీద్ అల్-షమ్మరి మాట్లాడుతూ, తమ సంస్థ చేపట్టిన ఈద్ ప్రాజెక్టు ద్వారా 17 దేశాల్లోని 21,420 కంటే ఎక్కువ కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మానవతా సవాళ్లను ఎదుర్కొంటున్న పాలస్తీనా, యెమెన్, సూడాన్, సోమాలియా, భారతదేశం, ఉగాండా, టాంజానియా, చాద్, మరియు బెనిన్ వంటి దేశాలకు సహాయాన్ని పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
అబ్నా అల్-కువైట్ ఛారిటీ (కువైట్ సన్స్ ఛారిటీ) ఛైర్మన్ మహమ్మద్ అష్కనాని మాట్లాడుతూ.. తమ ఛారిటీ పాకిస్తాన్, భారత్, నైజీరియా మరియు కోట్ డి'ఐవోర్ దేశాలలో 8,400 మంది లబ్ధి పొందారని తెలిపారు. నజాత్ ఛారిటీ ఛైర్మన్ ఫైసల్ అల్-జామెల్ మాట్లాడుతూ.. తమ సంస్థ 14 దేశాలలో తమ బలి ప్రాజెక్ట్‌ను అమలు చేసిందన్నారు. దీనివల్ల సుమారు 65,000 కుటుంబాలు, అంటే 325,000 మందికి పైగా వ్యక్తులు లబ్ధి పొందారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు KD 246,000 ఖర్చయిందన్నారు.
అల్-సలామ్ సొసైటీ డైరెక్టర్ జనరల్ హమద్ అల్-ఔన్ మాట్లాడుతూ.. తమ సంస్థ యెమెన్, కిర్గిజ్‌స్థాన్, భారత్ సహా పలు దేశాల్లో ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. కువైట్ దాతల మద్దతుతో తమ సంస్థ చేపడుతున్న విస్తృత మానవతా, అభివృద్ధి ప్రయత్నాలలో ఈ కార్యక్రమం ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. ఈద్ సంబంధిత ప్రాజెక్టులతో పాటు, సోషల్ రిఫార్మ్ సొసైటీకి అనుబంధంగా ఉన్న నమా ఛారిటీ, ఉగాండాలోని 1,250 మందికి పైగా సూడాన్ శరణార్థులకు ఆహారాన్ని పంపిణీ చేస్తుందన్నారు.
విద్యా రంగానికి సంబంధించి, ఇన్సాన్ ఛారిటీ సొసైటీ తన అభివృద్ధి మరియు విద్యా కార్యక్రమాలలో భాగంగా యెమెన్‌లో ఖదీజా బింట్ ఖువాయిలిద్ విద్యా కేంద్రాన్ని ప్రారంభించిందని ఉన్నాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ తెలిపారు. భవిష్యత్ తరాలను శక్తివంతం చేయడానికి తమ ప్రాజెక్ట్ కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







