ఆయిల్ ఔట్ పుల్ ని పెంచనున్న 7 ఒపెక్+ దేశాలు..!!
- June 08, 2026
రియాద్: ఏడు ఒపెక్+ దేశాలు జూలైలో తమ ఉమ్మడి ముడి చమురు ఉత్పత్తి లక్ష్యాలను రోజుకు 1,88,000 బ్యారెళ్ల (bpd) మేర పెంచడానికి అంగీకరించాయి. ఈ మేరకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా మరియు ఒమన్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కూటమి నెలవారీగా కోటాను పెంచడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా ప్రస్తుతం ఈ బ్యారెళ్ల లభ్యత పరిమితంగానే ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు ఏడు ఒపెక్+ దేశాలు తమ ఉత్పత్తి కోటాలను రోజుకు దాదాపు 600,000 బ్యారెళ్ల మేర పెంచాయి. ఆయిల్ మార్కెట్ స్థిరత్వానికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయంలో భాగంగా, ఏప్రిల్ 2023లో ప్రకటించిన అదనపు స్వచ్ఛంద సర్దుబాట్ల నుండి రోజుకు 188,000 బ్యారెళ్ల ఉత్పత్తి సర్దుబాటును అమలు చేస్తున్నారు. ఈ సర్దుబాటు వచ్చే నెల నుండి అమల్లోకి రానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







