ఒలింపిక్ విలేజ్ లో కాల్పులు ..
- August 09, 2016
విశ్వక్రీడాపోటీల వేదిక.. ఒలింపిక్ విలేజ్ లో కాల్పులు చోటుచేసుకున్నాయి. క్రీడా ప్రాంగణంలో జర్నలిస్టులు ప్రయాణిస్తున్న బస్సుపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. బ్రెజిల్ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు బాస్కెట్ బాల్ వేదిక నుంచి ప్రధాన వేదికకు బస్సులో వెళుతుండగా, మార్గం మధ్యలో కాల్పులు జరిగాయని, బస్సు కిటీకి అద్దాలను ధ్వసం చేసుకుంటూ దూసుకొచ్చిన బుల్లెట్ దెబ్బకు ఒకరు స్వల్పంగా గాయపడ్డారని ప్రత్యక్షసాక్షలులు వెల్లడించారు. అయితే అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. రియోలో కాల్పులకు అవకాశమేలేదని, ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభించామని, అద్దాలను ధ్వసం చేసింది బుల్లెట్లా లేక రాళ్లా అనే విషయం తెలియాల్సిఉందని రియో క్రీడల నిర్వాహక కమిటీ అధికార ప్రతినిధి మారియో అండ్రాడ తెలిపారు. (తప్పక చదవండి: రియో.. వెలుగుల్లో చీకట్లు) అసలే దోపిడీలు, హత్యలు విరివిగా చోటుచేసుకునే బ్రెజిల్ లో.. విశ్వక్రీడల ప్రారంభానికి ముందే భద్రతపై పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం.. ఒలింపిక్ గ్రామంలో(స్పోర్ట్స్ విలేజ్) సహా రియో నగరమంతా భారీ భద్రతా ఏర్పాటుచేసింది. అయినాసరే, గత శనివారం క్రీడాప్రాంగణానికి సమీపంలో కాల్పులు చోటుచేసుకోవడం గమనార్హం. చిన్నా చితకా అల్లర్లు కూడా జరిగాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







