విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- June 08, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లోని ఎస్‌ఎమ్‌ఎస్-2 డిపార్ట్‌మెంట్‌లో పనులు జరుగుతుండగా..ద్రవ ఉక్కుతో ఉన్న ల్యాడిల్ నుంచి హాట్‌మెంట్ బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి.దీంతో భారీ ఎత్తున వేడి ద్రవం అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది.
కార్మికులకు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఉక్కపోతగా ఉండే ఆ విభాగంలో ప్రమాదం జరిగిన సమయంలో పదుల సంఖ్యలో కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ల్యాడిల్ ద్రవం పడటంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ మంటల మధ్య ఇంకా కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్లాంట్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే స్టీల్‌ప్లాంట్ అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్‌లో పాస్‌పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..
- ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
- బ్యాంకుల్లో బయోమెట్రిక్ వేరిఫికేషన్..వినియోగం పై ఆందోళనలు?
- ఇరాన్ కు వ్యతిరేకంగా..ఐసీఏఓ వద్ద కువైట్ సెకండ్ ప్రొటెస్ట్..!!









