తన మరణాంతరం అంధులకు తన నేత్రాలు
- August 09, 2016
ప్రముఖ సినీనటి (సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఫేమ్) రెజీనా రెజీనా కాసాండ్ర తన నేత్రాలను దానం చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. తన మరణాంతరం అంధులకు తన నేత్రాలను అమర్చాలని కోరుతూ అంగీకారపత్రంపై మంగళవారం ఆమె నెల్లూరులో సంతకం చేశారు. నెల్లూరులోని డాక్టర్ అగర్వాల్ నేత్ర ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తన నేత్రదానాన్ని ప్రకటించారు. ఆస్పత్రిలోని ఐ-బ్యాంకును ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మన దేశంలో మూడు మిలియన్ల మంది అంధులు నేత్రదాతల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.నెల్లూరు రూరల్, నగర నియోజకవర్గ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్లు శ్రీనివాసయాదవ్, రాజానాయుడు, ఆస్పత్రి సీఈవో డాక్టర్ అదిల్ అగర్వాల్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ శివప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







